శాక్సాఫోన్ మూగ‌బోయింది- క‌న్నుమూసిన క‌దిరి

by సూర్య | Sat, Oct 12, 2019, 09:17 AM

 ప్రముఖ శాక్సాఫోన్ విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కదిరి గోపాల్‌నాథ్‌(69) కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  ఆయ‌న తుది శ్వాస విడిచారని కుటుంబ స‌భ్యులు మీడియాకు చెప్పారు. గోపాల్‌నాథ్‌ అంత్యక్రియలు శనివారం మంగళూరులో జరగనున్నాయని వారు తెలిపారు.
సంగీత ప్రపంచంలో శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన గోపాలనాథ్. స్వదేశంలోనే కాకుండా ఐరోపా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి సంగీత ప్రియుల నీరాజనాలందుకున్నారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాలులో కచేరీ చేసిన అతి కొద్ది మంది కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఈయన ఒకరు. మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి.  


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM