దగ్గుబాటి తీరుపై జగన్ సీరియస్

by సూర్య | Fri, Oct 11, 2019, 09:08 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు వస్తోంది. తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు బీజేపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ పరిణామం ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇభ్బంది కల్గిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కూడ వైసీపీలో చేరేలా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్టు సమాచారం. వైసీపీలో చేరే ముందే ఈ విషయమై జగన్ కు స్పష్టంగా తమ అభిప్రాయాలు తెలిపినప్పటికీ ఇప్పుడు జగన్ ఇప్పుడు ఒత్తిడి తేవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనోవేదనకు గురయ్యారని ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల ముందు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఆయన తనయుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరారు.కానీ, తన సతీమణి పురంధేశ్వరీ బీజేపీలోనే కొనసాగుతారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆనాడే స్పష్టం చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో అప్పటివరకు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా ఉన్న రామనాథంబాబు టీడీపీలో చేరారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికల సమయానికి హితేష్ చెంచురామ్ కు అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే రామనాథం బాబు తిరిగి వైసీపీలో చేర్చుకొన్నారు. రామనాథం బాబు వైసీపీలో చేర్చుకోవడంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనస్థాపానికి గురైనట్టుగా సమాచారం. ఈ పరిణామాలపై సీఎం జగన్ తో చర్చించాలని దగ్గుబాటి వెంకటేశ్వరావు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తొలుత ఆయనకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ దక్కలేదని సమాచారం. ఆ తర్వాత జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చొరవతో సీఎం జగన్ అపాయింట్ మెంట్ దక్కింది. ఈ సమయంలో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ వైసీపీలో చేర్పించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సీఎం జగన్ స్పష్టం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పురంధేశ్వరీ బీజేపీలో ఉండడం సరైందికాదని జగన్ అభిప్రాయపడినట్టుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలో చేరే సమయంలోనే పురంధేశ్వరీ బీజేపీలో కొనసాగుతారని చెప్పిన విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేసినట్టుగా సమాచారం.అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం అనివార్యమని జగన్ చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం పురంధేశ్వరీ అమెరికాలో ఉన్నారని ఆమె ఇండియాకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆమెతో చర్చించి తమ నిర్ణయాన్ని చెబుతామని దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ కు స్పష్టం చేశారని అంటున్నారు. ఒకవేళ పురంధేశ్వరీ బీజేపీకి గుడ్ బై చెప్పకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ రాజకీయ భవితవ్యం ఎలా ఉండోబోతోంది... జగన్ ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM