దేశంలోని నదులను కాపాడుకోవాలిఃప‌వ‌న్‌ కళ్యాణ్

by సూర్య | Fri, Oct 11, 2019, 08:40 PM

గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు పవన్ కళ్యాణ్. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జి.డి. అగర్వాల్ కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన పట్ల త‌న‌కున్న భక్తి శ్రద్దలను వ్యక్తం చేయడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగనే కాదని, భారత దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు. గంగా ప్రక్షాళణ పోరాటం దీనికి నాంది కావాలని అన్నారు. తొలుత పవన్ కళ్యాణ్ స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఆశ్రమం పక్కనే ప్రవహిస్తున్న గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్ర‌వారం కూడా పవన్ కళ్యాణ్ హరిద్వార్‌లోని పవన్ ధామ్ ఆశ్రమంలో విడిది చేస్తున్నారు. ఆయనతో పాటు రాజేంద్రసింగ్ కూడా అక్కడే బస చేస్తున్నారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM