దృష్టి లోపాలను నివారించేందుకు డా.వై.యస్.ఆర్ కంటి వెలుగుః ధర్మాన కృష్ణదాస్‌

by సూర్య | Fri, Oct 11, 2019, 08:05 PM

ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి గురువారం ఉద‌యం లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులు, పెద్దలలో దృష్టి లోపాలను నివారించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ దృష్టి లోపాలను నివారించేందుకు డా.వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇది చక్కని కార్యక్రమమని, దీనిద్వారా చిన్నారులు, పెద్దలు నేత్ర పరీక్షలు చేసుకుని వారి దృష్టి లోపాలను తొలగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇదేకాకుండా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, మరిన్ని కార్యక్రమాలను అమలుచేయబోతుందని మంత్రి స్పష్టం చేసారు.

Latest News

 
పెద్దపాడు నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక Tue, Apr 23, 2024, 12:05 PM
ఒంగోలు అసెంబ్లీకి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు Tue, Apr 23, 2024, 11:56 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి Tue, Apr 23, 2024, 11:55 AM
ప్రకాశం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కనిగిరి మోడల్ స్కూల్ Tue, Apr 23, 2024, 11:53 AM
మద్యం దుకాణాన్ని తనిఖీ చేసిన జేసీ Tue, Apr 23, 2024, 11:51 AM