ఇసుక కొరత పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by సూర్య | Fri, Oct 11, 2019, 06:44 PM

ఇసుక కొరతను నివారించేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన ధరలను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పట్టాదారులకు క్యూబిక్ మీటరు ఇసుకకు చెల్లించే ధరను ప్రభుత్వం పెంచింది. గతంలో క్యూబిక్ మీటరుకు రూ.60 రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని రూ.100కు పెంచారు. దీని ద్వారా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించే రీచ్‌లు, స్టాక్ యార్డులతో పాటు ప్రైవేటు పట్టాదారు భూముల్లోనూ ఇసుక తవ్వకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక తవ్వకాలు పెరగడం ద్వారా ఇసుక కొరతను అధిగమించ వచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

Latest News

 
పాతపట్నం నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Wed, Apr 24, 2024, 08:18 PM
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలోకి క్యూ కట్టిన ప్రతిపక్ష నేతలు Wed, Apr 24, 2024, 08:17 PM
రణస్ధలం నుండి వైసీపీలోకి వలసలు Wed, Apr 24, 2024, 08:16 PM
మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది జగన్ మాత్రమే Wed, Apr 24, 2024, 08:15 PM
లక్ష పుస్తకాలు చదివిన దత్తపుత్రుడికి ఆమాత్రం తెలియదా...? Wed, Apr 24, 2024, 08:15 PM