త్వరలో తక్కువ ధరలో యాపిల్ ఫోన్లు

by సూర్య | Fri, Oct 11, 2019, 12:51 PM

యాపిల్ ఫోన్ వినియోదారులకు శుభవార్త. త్వరలో అతి తక్కువ ధరలో యాపిల్ ఫోన్లు లభించనున్నాయి. సాధారణంగా యాపిల్ ఫోన్లంటే కేవలం ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాన్ని అబద్ధం చేస్తూ తక్కువ ధరలో ఐఫోన్ SEని యాపిల్ 2016లో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.19,999 మాత్రమే. ఆ ఫోన్ వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిపోయిన అనంతరం దానికి తర్వాతి వెర్షన్ ఐఫోన్ SE2కు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో(జనవరి-మార్చి) మార్కెట్లోకి రానుందని గురువారం ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో తెలిపారు.


ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 11లో ఉపయోగించిన ఏ13 చిప్ సెట్ ను ఇందులో కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఐఫోన్లలో ఉపయోగించే అత్యంత వేగవంతమైన చిప్ ఇదే. ఐఫోన్ 8 డిజైన్ మాదిరిగానే దీని డిజైన్ ఉండనుందని సమాచారం. దీని స్క్రీన్ సైజ్ 4.7 అంగుళాలుగా ఉండవచ్చు. ఇందులో 3 జీబీ ర్యామ్ కూడా ఉంటుందని, పనితీరు విషయంలో ఐఫోన్ 11కు ఏమాత్రం తీసిపోదని కువో పేర్కొన్నారు. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ అన్ లాక్ ఉంటుందో, ఫేస్ అన్ లాక్ ఉంటుందో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక దీని ధర రూ.26,990గా ఉంటుందని 91 మొబైల్స్ నివేదికలో తెలిపింది.లుక్ విషయంలో ఈ ఫోన్ ఐఫోన్ నాచ్ తో ఉండి, ఐఫోన్ X మాదిరిగా ఉంటుందని కొందరు, 4.7 అంగుళాల డిస్ ప్లేతో ఐఫోన్ 8 తరహాలో ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే ఇప్పటి దాకా లీకైన వివరాలు, ఫొటోలను బట్టి చూస్తే ఈ ఫోన్ 4.7 అంగుళాల స్క్రీన్ సైజ్ తో ఐఫోన్ X తరహాలో ఉండనున్నట్లు తెలిసింది.


ఈ సెప్టెంబర్ లోనే యాపిల్ 6.4 అంగుళాల ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ను, 5.8 అంగుళాల ఐఫోన్ 11 ప్రోను, 6.1 అంగుళాల ఐఫోన్ 11ను లాంచ్ చేసింది. ఇక ఈ ఐఫోన్ SE 2 వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కువో తెలిపారు. ఎందుకంటే యాపిల్ కు సంబంధించిన తర్వాతి వెర్షన్ ఫోన్లు ఎలాగో సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో లాంచ్ అవుతాయి. వాటికి, ఈ ఐఫోన్ ఎస్ఈకి మధ్య కాస్త గ్యాప్ ఉండాలి కాబట్టి ఈ బడ్జెట్ ఐఫోన్ గురించిన శుభవార్త మనం త్వరలోనే వినవచ్చు.

Latest News

 
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM