టీడీపీ నాయకుడి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

by సూర్య | Fri, Oct 11, 2019, 12:25 PM

మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర  రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ చేపట్టిన 36 గంటల నిరసన దీక్షను పోలీసులు ఆదిలోనే భగ్నం చేశారు. ఈరోజు ఉదయం దీక్ష ప్రారంభించనున్నట్లు ముందే మాజీ మంత్రి ప్రకటించడంతో ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయితే దీన్ని ముందే పసిగట్టిన రవీంద్ర అంతకుముందే  వేరే మార్గంలో బయటకు వెళ్లిపోయారు. దీక్షా స్థలిగా నిర్ణయించిన మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్దకు చేరుకున్నారు.


అనంతరం దీక్షకు సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునిడిని రవీంద్ర దీక్షకు వెళ్లకుండా పోలీసులు ముందే గృహనిర్బంధం చేశారు.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM