హైదరాబాద్‌ లాంటి రాజధాని నగరం అవసరం లేదా?

by సూర్య | Sat, Aug 24, 2019, 06:33 PM

 


తెలంగాణకు హైదరాబాద్‌ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరం అవసరం లేదా? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాజధాని అమరావతికి ముంపు సమస్య లేనే లేదని సృష్టం చేశారు. వరదలు వచ్చాయని ముంబై, చెన్నై నగరాల నుంచి ఆ రాష్ట్రాల రాజధానులను తరలించేస్తారా? అని ప్రశ్నించారు. ముంపుపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. గుంటూరులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతయ విమానాశ్రయం, మెట్రో వంటి మౌలిక వసతులు బాగా ఉపయోగపడ్డాయని, దానివల్లే ఇటీవల అమెజాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అక్కడికి వస్తున్నాయన్నారు. రాజధాని అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదు. ఉద్యోగాలు, ఆదాయం, సంపద అన్నీ రావాలి. ఒక్క హైదరాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వందల కోట్ల రిజిస్ట్రేషన్‌ ఆదాయం వస్తోంది అని తెలిపారు.  


 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM