సెప్టెంబరు 9 నుండి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి ప‌విత్రోత్స‌వాలు

by సూర్య | Sat, Aug 24, 2019, 04:00 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 8న సాయంత్రం 5.00 గంటలకు భాగ‌వ‌తారాధ‌న, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.


వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 7.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 6.00 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10వ తేదీ ఉదయం 7.30 నుండి మ‌ధ్యాహ్రం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న ఉదయం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.


రూ. 200/- చెల్లించి గృహ‌స్తులు (ఇద్ద‌రు) ప‌విత్రోత్స‌ల్లో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల‌కు చివ‌రిరోజు ఒక ప‌విత్ర‌మాల‌ను, తీర్థ‌ప్ర‌సాదాల‌ను బ‌హుమానంగా అంద‌జేస్తారు.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM