సీఎం ప్రకటన చేయాలి

by సూర్య | Fri, Aug 23, 2019, 09:38 PM



అమరావతిలో రాజధాని ఉంటుందో లేదో తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రామకృష్ణను రాజధానికి భూములిచ్చిన రైతులు కలిశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా తమకు అండగా నిలవాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. 34 వేల ఎకరాలకు పైగా రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా గత ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. కానీ వారికి ప్రస్తుత ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కానీ జగన్‌ ఇప్పటి వరకూ ప్రకటన చేయకపోవడం సరైంది కాదని హితవు పలికారు. రాజధానిలో ఆగిన పనులను కొనసాగించాలని కోరారు. రాజధాని రైతులకు ఏవేవీ హామీలిచ్చారో.. ఆ హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనన్నారు. రాజధాని ప్రాంత వాసులకు సీపీఐ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.


 


 


 



Latest News

 
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM
నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు Fri, Apr 19, 2024, 07:32 PM
టీడీపీ అభ్యర్థి వాచీ ఖరీదే 7.75 లక్షలట.. ఇక ఆస్తుల సంగతి తెలుసా Fri, Apr 19, 2024, 07:29 PM
ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. మరదలిని ఓడించేందుకు బరిలో బావ Fri, Apr 19, 2024, 07:26 PM