12 పేజీలతో కూడిన నివేదిక కేంద్రానికి సమర్పించిన పిపిఎ

by సూర్య | Fri, Aug 23, 2019, 08:35 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అంశం కీలక మలుపులు తిరుగుతోంది. దశాబ్ధాల కల అయినటువంటి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారింది. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. 
అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రీటెండరింగ్ కు సంబంధించి కార్యచరణ సైతం సిద్ధం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు వివాదలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. 


రివర్స్ టెండరింగ్ అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని నివేదిక కోరింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ శుక్రవారం తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. 12 పేజీలతో కూడిన నివేదికన కేంద్రానికి అందజేసింది. 
నివేదికలో రివర్స్ టెండరింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ వ్యవహారం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  
పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల లాభాలు కంటేనష్టాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కొనసాగితే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని స్పష్టం చేసింది. ఫలితంగా పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది.  

Latest News

 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM
30న రామనారాయణం దశమ వార్షికోత్సవ వేడుకలు Thu, Mar 28, 2024, 04:00 PM