సమాజ శ్రేయస్సుకే విశ్వశాంతి మహాయజ్ఞం

by సూర్య | Fri, Aug 23, 2019, 08:16 PM

సమాజ శ్రేయస్సుకే విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానం దలహరి తెలిపారు. కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని గోశాల ఆవరణలో విశ్వశాంతి మహాయజ్ఞం గురు వారం వైభవంగా నిర్వహించారు. గోశాలలో జరిగన ఘటన విశ్వానికే అశుభమని గ్రహించి మహాయజ్ఞం చేసి అంతా శుఖశాంతులతో ఉండేలా యజ్ఞం చేశామని తెలిపారు. గోశాలల సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా గోశాలల నిర్వహణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం శ్రేయస్కరం కాదని వైసీపీ భావిం చడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మరే ప్రదేశంలో నిర్మించాలనే ఆలోచన చేస్తే దాన్ని పార్టీపరంగా, వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం నిమిత్తం రూ.1,500 కోట్లు కేటాయించిందని, ప్రజాధనం దుర్వి నియోగం చేస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోం అన్నారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లా డుతూ పెద్దమొత్తంలో ఆవుల మరణాలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిట్‌ విచా రణ చేస్తుందని తెలిపారు. త్వరలో వైద్య శిబిరం నిర్వహించి గోవుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలిం చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మైల వరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ కొత్తూరు తాడేపల్లి గోశాలను రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.  

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM