అన్యమత ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య: స్వరూపానంద

by సూర్య | Fri, Aug 23, 2019, 07:31 PM

ఈ మధ్య బాగా కలకలం రేపుతున్న మరో విషయం తిరుపతి గుట్టపైకి వెళ్లే బస్సు టికెట్ల వెనుక భాగంలో అన్యమత ప్రచారం చేయడం.. దీనిపై స్పందిస్తూ.. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ తెచ్చారన్నారు. ఆ జీవోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తక్షణం సమీక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరారు.  

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM