తెలంగాణ ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి : బాబు

by సూర్య | Fri, Aug 23, 2019, 02:54 PM

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సంబంధాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని వైసీపీ ప్రభుత్వం చెబుతుండటాన్ని ఆయన తప్పుపట్టారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లిస్తేనే ఓర్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇక్కడ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా నది వరదలపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మంచిగానే ఉంటే.. పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలపై కృష్ణా వాటర్ బోర్డుకు తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM