శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే దాతలకు మాత్రమే గదులు

by సూర్య | Thu, Aug 22, 2019, 07:31 PM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు cdms.ttdsevaonline.com వెబ్‌సైట్‌ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.


బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబ‌రు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబ‌రు 2 నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టిటిడి కోరుతోంది.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM