కోడెలపై క్రిమినల్ కేసు పెడతాం : గోపిరెడ్డి

by సూర్య | Thu, Aug 22, 2019, 07:10 PM

సీఎం జగన్ అమెరికా నుంచి రాగానే మాజీ స్పీకర్ కోడెల అక్రమ దందాపై సిట్ లేదా సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని కోరతామని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కోడెల బండారం బయటపడింది కాబట్టే.. అసెంబ్లీ ఫర్నీచర్ వెనక్కి ఇచ్చేస్తామంటున్నారని తెలిపారు. అవసరమైతే కోడెలపై క్రిమినల్ కేసు పెడతామన్నారు. ఇప్పటికే కోడెలకు అధికారులు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఇవాళో.. రేపో కోడెల నుంచి వస్తువులు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కోడెల వ్యవహారంలో చీఫ్ మార్షల్ తన ప్రమేయం ఉన్నదని ఒప్పుకున్నారన్నారు. అందుకే ఆయన్ని చీఫ్ మార్షల్ విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరికొంత మంది అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుందన్నారు. విచారణ అనంతరం అందరిపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM