ఈ-కెవైసి తో ప్రజలు ఇబ్బందులు

by సూర్య | Thu, Aug 22, 2019, 05:51 PM

ఈ-కేవైసీ విధానంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. నకిలీ రేషన్‌ కార్డులను ఏరివేసి.. అర్హత కలిగిన వారికే నిత్యవసర సరకులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా..కావాల్సినన్ని కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నా.. యంత్రాంగం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


శ్రీకాకుళం జిల్లాలో ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలోని మీసేవా కేంద్రాల్లో ఈ తరహా సేవలు నిలిపివేశారు. కొన్ని బ్యాంకులతో పాటు, తపాలా కార్యాలయాల్లో అవకాశం కల్పించారు. కావాల్సినన్ని కేంద్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదుతోపాటు నవీకరణ కోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే ఈ ప్రక్రియకోసం జనాలు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలతోపాటు రేషన్‌ సరకులకు ఈ కేవైసీ తప్పని సరికావడంతో జనాలు నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM