పరస్పర అవగాహనతో సహజీవనం అత్యాచారం కిందకు రాదు : సుప్రీం

by సూర్య | Thu, Aug 22, 2019, 05:35 PM

ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనంచేసి.. అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అది అత్యాచారం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సేల్స్‌టాక్స్ అసిస్టెంట్‌ కమిషనర్‌ గా పని చేస్తున్నఓ మహిళ సీఆర్పీఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌తో సహజీవనం చేశారు. ఆరేళ్లు కలిసి ఉన్నారు. వీరిద్దరూ ఒకరి ఇళ్లలో మరొకరు నివాసం కూడా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత డిప్యూటీ కమాండెంట్‌ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అయ్యారు. ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయి. దీంతో ఆమె కోర్టుమెట్లెక్కింది. పెళ్లి చేసుకుంటానని హావిూ ఇచ్చి.. బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకు సహజీవనం చేశాడని కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ. మరో అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, ఇందిరాబెనర్జీ ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే.. అత్యాచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఇద్దరి అంగీకారంతోనే కలిసి ఉన్నప్పుడు అత్యాచారం కింద రాదని స్పష్టం చేసింది.

Latest News

 
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM
మామా అల్లుళ్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ Thu, Apr 18, 2024, 08:58 PM
చంద్రబాబు, నారా లోకేష్‌లపై ఎన్ని కేసులున్నాయో తెలుసా..? Thu, Apr 18, 2024, 08:57 PM
సీఎం జగన్‌పై రాయి దాడి... నిందితుడికి 14 రోజుల రిమాండ్ Thu, Apr 18, 2024, 08:48 PM
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM