ఏపీ సర్కార్ మరో నిర్ణయం.. ప్రణాళిక బోర్డు రద్దు.

by సూర్య | Thu, Aug 22, 2019, 02:08 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి. ఆర్థికవనరుల కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, నీటి నిర్వహణ, అసమానతల తగ్గింపుపై ఈ బోర్డులు దృష్టి సారిస్తాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ బోర్డులో చైర్మన్ తో పాటు సభ్యులు ఉంటారు. చైర్మన్ ను మూడేళ్ల కాలానికి నియమిస్తారు. ఈ బోర్డులు విజయనగరం(విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం), కాకినాడ (ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా), గుంటూరు(గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), కడప(కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) కేంద్రంగా పనిచేయనున్నాయి.

Latest News

 
అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం Fri, Mar 29, 2024, 10:53 AM
నువ్వా, నేనా..? అంటున్న టీడీపీ వైసీపీ అభ్యర్థులు Fri, Mar 29, 2024, 10:52 AM
ప్రజల భవిష్యత్‌కు టీడీపీ అండగా నిలవనుంది Fri, Mar 29, 2024, 10:52 AM
ఏప్రిల్ 1న జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ Fri, Mar 29, 2024, 10:51 AM
ఏప్రిల్ 7న పెందుర్తిలో పర్యటించనున్న పవన్ Fri, Mar 29, 2024, 10:50 AM