ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’కు ఏర్పాట్లు పూర్తి

by సూర్య | Wed, Aug 21, 2019, 08:58 PM

 టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 23న శుక్ర‌వారం జరుగనున్న గోకులాష్టమి గోపూజ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 నుండి 9 గంటల వరకు వేణుగానం, ఉదయం 7.30 నుండి 8.30 గంటలకు ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి 10.00 గంటల వరకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటం, ఉదయం 8 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమాలు చేపడతారు.


ఉదయం 10.15 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ ఘనంగా జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు. సాంస్క తిక కార్యక్రమాల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ సందర్భంగా పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించింది.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM