ప్రకాశం బ్యారేజ్ గేట్ వద్ద ఇరుక్కుపోయిన పడవ!

by సూర్య | Wed, Aug 21, 2019, 04:48 PM

వరదలో కొట్టుకొచ్చిన ఓ పడవ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ 68వ గేటు వద్ద అడ్డంగా ఇరుక్కుపోయింది. వరదలకు ఎగువ నుంచి కొట్టుకొచ్చిన పడవ ఈ గేటు వద్ద చిక్కుకుపోవడంతో, గేటు మూసివేసేందుకు ఇబ్బందిగా మారింది. అడ్డుగా ఉన్న పడవను తొలగించేందుకు ఎన్డీ ఆర్ఎఫ్ సిబ్బంది యత్నిస్తున్నాయి. కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకులతో సందడి నెలకొంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వస్తున్న సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM