పార్టీలకు వణుకు పుట్టించేంతగా కొత్త సభ్యత్వాలు!

by సూర్య | Wed, Aug 21, 2019, 03:41 PM

కేంద్రంలో తిరుగులేని ఆధిక్యతతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... మరింత బలపడే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వాల విషయంలో దూసుకుపోయింది. తాజాగా దాదాపు 4 కోట్ల మంది బీజేపీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. దీంతో, బీజేపీ సభ్యత్వాలు 14.78 కోట్లకు చేరుకున్నాయి.బీజేపీలో 3,78,67,753 మంది కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నారని ఓ ప్రకటనలో ఆ పార్టీ వెల్లడించింది. జూలై 6న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటితో (ఆగస్ట్ 20) ముగిసిందని తెలిపింది. కొత్త సభ్యత్వాలతో కలిపి బీజేపీ మొత్తం సభ్యత్వాలు 14,78,67,753కు చేరుకున్నాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లో 55 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పింది. తొలుత 2 కోట్ల కొత్త సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ... ఆ తర్వాత టార్గెట్ ను 4 కోట్లకు పెంచింది. అనుకున్నట్టుగానే తన టార్గెట్ ను బీజేపీ చేరుకోవడం గమనార్హం. ఊహించని విధంగా బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM