నవయుగ కంపెనీ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

by సూర్య | Tue, Aug 20, 2019, 09:47 PM

ఏపీ హైకోర్టులో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంలో  నవయుగ కంపెనీ వేసిన పిటిషన్‌ పై వాదనలు ముగిసాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. నవయుగ కంపెనీ ఎటువంటి నిబంధలు ఉల్లంఘించలేదని ఆ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైడల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి.. సకాలంలో జెన్‌కో స్థలాన్ని చూపించలేదని వివరించారు. ప్రభుత్వం ఎలాంటి కారణం చూపించకుండా ఒప్పందాన్ని.. ఎలా రద్దు చేస్తారని ఆయన న్యాయస్ధానాన్ని ప్రశ్నించారు.
అయితే దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ స్థలం చూపించలేదని మిగతా ప్రాజెక్ట్‌ల విషయంలో.. నిర్ణయం తీసుకోకూడదనడం ఎలా అని ప్రశ్నించారు. నిజానికి నవయుగ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని.. హైకోర్టుకు రావడం సరికాదన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ కొనసాగించుకునేందుకు.. తమ సర్కార్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM