కర్ణాటక కేబినెట్ మంత్రులు

by సూర్య | Tue, Aug 20, 2019, 12:18 PM

కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రబుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM