ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న ఫర్నీచర్, ఏసీలు చోరీ

by సూర్య | Tue, Aug 20, 2019, 11:43 AM

ఏపీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని 2017, మార్చిలో అమరావతికి తరలించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి చెందిన కొంత ఫర్నీచర్ తో పాటు ఏసీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ ను తరలిస్తుండగా, కొంత మాయమైందని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదులో తెలిపారు. కాగా, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడే ఈ ఫర్నీచర్ మాయమయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫర్నీచర్, ఏసీలను సత్తెనపల్లి, నరసరావుపేటలకు తరలించినట్లు గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM