మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం అల్లుడు ర‌తుల్ పురి అరెస్ట్

by సూర్య | Tue, Aug 20, 2019, 10:46 AM

సెంట్రల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం క‌మ‌ల్‌నాథ్ మేన‌ల్లుడు, వ్యాపారవేత్త ర‌తుల్ పురిని ఇవాళ ఢిల్లీలోని ఇన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అధికారులు అరెస్టు చేశారు. అక్ర‌మంగా బ్యాంకుల వ‌ద్ద సుమారు 354 కోట్ల రుణం తీసుకున్న కేసులో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. వారం క్రిత‌మే మోస‌ర్ బేయ‌ర్ ఇండియా లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఆ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైర‌క్ట‌ర్ దీప‌క్ పురి, డైర‌క్ట‌ర్ నీతాపురి, ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ ర‌తుల్ పురిల‌పై కేసును బుక్ చేశారు. అగ‌స్టావెస్ట్‌ల్యాండ్ కేసులోనే ర‌తుల్ పురికి హస్తం ఉన్న‌ట్లు ఈడీ విచారిస్తున్న‌ది. ఇదే కేసులో అత‌నికి ఢిల్లీ కోర్టు నాన్‌బెయిల‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ‌ద్ద ర‌తుల్ పురికి చెందిన కంపెనీ 354 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ప్పుడు ప‌త్రాల‌ను చూపి.. మోస‌ర్ బేయ‌ర్ కంపెనీ త‌మ వ‌ద్ద రుణం తీసుకున్న‌ట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM