ప్రజావేదిక కూల్చివేత‌పై స్పందించిన పవన్ కల్యాణ్ !

by సూర్య | Mon, Jun 24, 2019, 08:57 PM

అక్రమకట్టడాలైతే ప్రజావేదికతోపాటు అన్నీ కూల్చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన .. పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ‘‘స్వార్థ ప్రయోజనాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారు. జనసేన నుంచి ఎవరూ వెళ్లడం లేదు. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం. మా పార్టీలోకి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం. జమిలి ఎన్నికలు వస్తే స్వాగతిస్తాం. హోదా సాధనపై ఏపీ ప్రజల్లో తపన కనిపించడం లేదు. ఓడిన తర్వాత కూడా జనం ఆపి తమ సమస్యలు చెప్పడం చూస్తే నాపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో అర్ధమైంది. జనం అజెండా ఏంటో వారు ఏం కోరుకుంటున్నారో వచ్చే కొన్ని నెలల్లో ప్రజాఅజెండా ఖరారు చేస్తాం. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతా. వైసీపీ విధానాలు తెలిశాకే స్పందిస్తా. ఏడాది తర్వాత ప్రభుత్వంలో తప్పులను ప్రశ్నిస్తాం. టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్టే వైసీపీ ప్రభుత్వానికీ ఇస్తాం. ఏపీ ఆస్తులు తెలంగాణకు ఎలా ఇచ్చారు?. వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.’’ అని అన్నారు.


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM