నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి : వైఎస్ జగన్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:47 PM

నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి. ఇదే నా ఆశయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జగన్ మాట్లాడుతూ… ట్రాన్సఫరన్స్, అండ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండాలన్నారు. చిరునవ్వుతో ఉండండి అదే మంచి జరుగుతుందన్నారు. ప్రతి మండే స్పందన పేరుతో పిర్యాదులను స్వీకరించండి. ఆ రోజూ ఏ మీటింగ్ లు ఉండవద్దన్నారు. ఫిర్యాదు తీసుకోగానే రసీదు ఇవ్వండి. ఫోన్ నెంబర్ తీసుకోండి. గడువు కూడా ఇవ్వండని అన్నారు. నేను కూడా రచ్చబండ నిర్వహిస్తానన్నారు. రాండమ్ గా చెకింగ్ చేస్తానని, పై స్థాయి వారు కూడా రాండమ్ ఛెక్ చేయండని అన్నారు. మొక్కుబడిగా కాకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి మూడో శుక్రవారం మన దగ్గర పనిచేసే సిబ్బంది కోసం కేటాయించండి. సమస్యలను పరిష్కరించండన్నారు. కలెక్టర్లు వారానికి ఒక సారి హాస్టల్, పిహెచ్ సి, స్కూళ్లను సందర్శించండి. ఒక రోజు నిద్ర చేయండి. తెల్లారి ప్రజలతో మమేకమవ్వాలన్నారు. మీరు బస చేసిన ప్రాంతంలో ఇప్పుడు, అప్పుడు ఫోటోలు చూపండని, విద్య, వైద్యం, రైతులకే ప్రధాన ప్రాధాన్యత ఉంటుందన్నారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM