ఉగాది నాటికి అందరికీ ఇంటిస్థలాలు : వైఎస్ జగన్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:37 PM

ఉగాది నాటికి ఇంటి స్థలం లేని వారు ఎవరు రాష్ట్రంలో ఉండకూడదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో జగన్ మాట్లాడుతూ.. 25 లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో ఇవ్వాలన్నారు. పట్టా చేతిలో ఉంటుంది…కానీ స్థలం ఉండదు… దృష్టి పెట్టి ఎక్కడ ఎంత అవసరమో గుర్తించి ఉగాది నాటికి రిజిస్టర్ ప్లాట్ ఇవ్వాలన్నారు. క్రెడిబిలిటీ అనే పదానికి విలువ ఉండాలన్నారు. తన లేదు మన లేదు పాలసీ కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లా పోర్టల్ తీసుకురావాలన్నారు. కలెక్టర్లు సమగ్రంగా భూముల పై ల్యాండ్ ఆడిట్ నిర్వహించలన్నారు. ఇతర శాఖల నుండి ఫీడ్ బాక్ తీసుకోండి..రాజ్యాంగం, చట్టం, న్యాయంలను తుంగలో తొక్కారన్నారు. 23 మంది ఎమ్మెల్యే ల ను తీసుకెళ్లి వారి ద్వారా మీ పై పెత్తనం చేస్తారన్నారు. ఎంపీటీసీ, కౌన్సిలర్లను తీసుకెళ్లి పదవులు పొందుతారన్నారు. మీరు ఎన్నికలు సజావుగా ఎలా జరుపుతారని, ప్రభుత్వ ఉద్యోగులు పట్ల గౌరవం అభిమానం పెరగాలన్నారు. ఈ సమావేశానికి వచ్చేటప్పుడు తెలిసిన కొంతమందిని అడిగా.. మార్పు రావాలి అన్నారని జగన్ అన్నారు. ఐఏఎస్‌ అధికారులు వారంలో ఒకరోజు పీహెచ్‌సీ, హాస్టళ్లలో నిద్ర చేయాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను అధికారులు స్వయంగా తెలుసుకోవాలన్నారు. ప్రతి మూడో శుక్రవారం సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM