బీజేపీలో చేరనున్న అంబికా కృష్ణ.... !

by సూర్య | Mon, Jun 24, 2019, 12:34 PM

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో టీడీపీ శిబిరంలో కలవరం మొదలైంది. మరోవైపు, భారీ ఎత్తున టీడీపీ నుంచి చేరికలు ఉండబోతున్నాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి పీతల సుజాతపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అనంతరం తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. బాలకృష్ణతో కూడా అంబికా కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారతుండటం టీడీపీకి పెద్ద లోటనే చెప్పాలి.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM