నీటి కోసం డిఎంకె నిరసన ప్రదర్శన

by సూర్య | Mon, Jun 24, 2019, 12:00 PM

చెన్నైలో నీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తమిళనాడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా నేడు చెన్నైలో ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చేపాక్‌ ప్రాంతంలో జరిగిన నిరసన ప్రదర్శనకు వేలాదిమంది డిఎంకె కార్యకర్తలు హాజరయ్యారు. ఎఐఎడిఎంకె నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని, స్థానికులు నీటి కోసం అలమటిస్తున్నారని నిరసనకారులు అన్నారు. రాష్ట్రంలోని నీటి సమస్యపై డిఎంకె ఎంపి టిఆర్‌ బాలు లోక్‌సభలో నోటీసు ఇచ్చారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM