విద్యార్ధుల‌కు మంచి ర్యాంకులు రావాల్సిందే..

by సూర్య | Sun, Jun 23, 2019, 01:00 AM

మనపిల్లలకు మంచిర్యాంకులు రావాలని ఎలాభావిస్తామో అదే భావన మనదగ్గర చదివే పిల్లలకు కూడా రావాలనే ధృడసంకల్పం కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్టరర్లలో ఉండాలని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు  శనివారం ఆయ‌న‌ కలెక్టర్ కార్యాలయంలోజిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యాశాఖాధికారులు, సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ తదితర పరీక్షల్లో క్వాలిఫై అవ్వడం ముఖ్యంకాదని, ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులకు ఉత్తమ భోధన అందించి వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలన్నారు. మనపిల్లలు ఆయా పోటీపరీక్షల్లో క్వాలిఫై అయి ర్యాంకులు సాధించకపోతే సంతృప్తి చెందుతామా? అని ఆయన ప్రశ్నిస్తూ, ఈ విషయంపై సంబంధిత ప్రిన్సిపల్స్, లెక్చరర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులను విద్యార్థులచే బట్టీపట్టే విధానానికి స్వస్తిపలకాలన్నారు


 


 

Latest News

 
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM