జన్మదిన వేడుకలు ఏయులో జ‌రుపుకున్న‌ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి

by సూర్య | Sun, Jun 23, 2019, 12:56 AM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖామాత్యులు పాముల పుష్పశ్రీ వాణి జన్మదిన వేడుకలు శ‌నివారం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా వై.యస్‌.ఆర్‌.విగ్రహానికి, డా||బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలదండలు వేశారు. 


అనంతరం సి.డి.సి. కార్యాలయంలో ఆమె  కేక్‌ ని కట్ చేశారు.ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ విద్యార్ధులు, ఉద్యోగులు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవిష్యత్‌ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.


 వై.యస్‌.ఆర్‌. అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు శత్రుశర్ల పరిక్షిత్‌ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలందరికి చేరేవిధంగా విద్యావాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి 4.50 లక్షల వాలంటీర్లని నియమిస్తున్నారన్నారు. .యస్‌.ఆర్‌.విద్యార్ధి విభాగం విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు బి.కాంతారావు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి సామాన్య ప్రజలతో మమేకమై ప్రజల సమస్యను తెలుసుకుంటూ వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి నమ్మినబంటుగా ఉంటూ అతి చిన్నవయస్సులో ఉపముఖ్యమంత్రి పదవి పొందారని అన్నారు. ఆమె భవిష్యత్‌లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM