ప్రతీ కుటుంబానికి నవరత్నాలు అందాల్సిందే : మ‌ంత్రి ముత్తంశెట్టి

by సూర్య | Sat, Jun 22, 2019, 07:40 AM

పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నవరత్నాలు అని వాటిని అన్నింటిని నెరవేర్చడం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కోన్నారు. కాన్ఫరెన్స్‌ హాలులోజివియంసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను   ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైరైజ్‌ భవనాలతోబాటు, స్లమ్స్‌పై దృష్టి సారించాలని హితవు పలికారు. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖగా పేర్కోన్నారు. స్ధలాలకు ఎంతో డిమాండ్‌ ఉన్న దృష్ట్యా ఆక్రమణలకు గురికాకుండా చూడాలని కోరారు. నగర అభివృద్దికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని పేర్కోన్నారు. అధికారులు విజన్‌తోబాటు మిషన్‌లా కొనసాగించలలాని కోరారు. క్షేత్రస్దాయి సమస్యల పరిష్కారానికి అందరు అధికారులు చొరవ చూపాలని పేర్కోన్నారు. అందుబాటులో నున్న వనరులు, మానవ వనరులను వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించాలని తెలిపారు. అదేవిధంగా జోనల్‌ స్దాయిలో వ్యవస్దను పటిష్టపరచాలని కోరారు. అందరం కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా స్వచ్ఛభారత్‌- స్వచ్ఛ విశాఖ ద్వారా ఉత్తమ ర్యాంక్‌ సాధించాలని అభిలషించారు. నగరంలో వాతావరణ కాలుష్యం పెరగకుండా మొక్కలు నాటడంతో బాటు వాటిని పెంచాలని పేర్కోన్నారు. నగర సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు.


 


 


 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM