దహన సంస్కార ఖర్చుల చెల్లింపు సరళతరం

by సూర్య | Fri, Jun 21, 2019, 04:57 PM

రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, వయో పరిమితి పూర్తయ్యి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు గానీ దురదృష్టవశాత్తూ మరణిస్తే, దహన సంస్కారాలకు గాను వారి కుటుంబ సభ్యులకు  చెల్లించే మొత్తం రూ.10,000 /-  నుండి రూ.15,000/- లకు పెంచిన‌ట్టు సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ ఎన్.వి.సురేంద్రబాబు చెప్పారు.  అదే విధంగా మెడికల్ కారణాల రీత్యా, స్వచ్చంద పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ఈ  ఖర్చులు చెల్లించే విధానం వర్తింపచేయాల‌ని ఆదేశించారు. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ విన్నపం మేరకు ఈ ఖర్చులు చెల్లించేందుకు “డెత్ సర్టిఫికెట్” ఒత్తిడి చేయవద్దని   దహన సంస్కార ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని వారికి అందుబాటులో ఉన్న సమీప డిపో నుండి పొందే సౌలభ్యం కూడా ఏర్పాటు చేయాలంటూ. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ సంఖ్య. పి.డి-16/2019, తేదీ.03-06-19లో పేర్కొన్నారు. దాని ప్రకారం పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 


(1) మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులు, ఏ డిపో నుండి దహన సంస్కార ఖర్చుల మొత్తాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నారో ఆ డిపోలో  “పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి జారీ చేసే ట్రావెల్ కమ్ మెడికల్ కార్డు” ను దాఖలు చేసి ఆ మొత్తం పొందవచ్చు.   


(2) ఆ డిపో మేనేజరు,  డెత్ సర్టిఫికెట్ ఒత్తిడి చేయకుండా  మృతి చెందిన ఉద్యోగి  కుటుంబ సభ్యులు పేర్కొన్న ఒకానొక కుటుంబ సభ్యుని బ్యాంకు ఖాతాకు రూ.15 ,000 /- జమ చేయాలి. తర్వాత ఆ ఉద్యోగి ఏ డిపోలో అయితే  పదవీ విరమణ పొంది ఉన్నారో, ఆ డిపోకు డెబిట్ అడ్వైజ్ (ఐ.డి కార్డుతో సహా) పంపుతారు.  


(3) ఈ ప్రక్రియలో కూడా పేరెంట్ డిపో డెత్ సర్టిఫికెట్ ఒత్తిడి చేయనక్కర్లేదు. మరణించిన ఉద్యోగి తాలూకు దహన సంస్కార ఖర్చులు చెల్లించిన తర్వాత, ఆ ఉద్యోగి చనిపోయిన వివరాన్ని ఎస్.ఆర్.బి.ఎస్/ సి.సి.ఎస్ / పి.ఎఫ్ విభాగాలకు వెంటనే తెలియచేయాలి

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM