24న జిల్లా కలెక్టర్లతో సిఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక సమావేశం

by సూర్య | Fri, Jun 21, 2019, 04:51 PM

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఈ నెల 24వ తేదీన మొట్టమొదటి జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. పాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యం, ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ, స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగంగా పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, వ్యవసాయం, కరవు, తాగునీరు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.  24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు.  

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM