హోదా కోసం జ‌గ‌న్ చేస్తున్న‌దేంటి?

by సూర్య | Fri, Jun 21, 2019, 02:36 PM

 ఏపికి ఎలాంటి ప్ర‌త్యేక హోదా ఇవ్వబోమన్న నినాదంతోనే…  2019 ఎన్నికలలో జ‌నం ముందుకు వెళ్లింది బీజేపీ. తాము 2014లో ఇచ్చిన హ‌మీ ఆయువు తీరిపోయింద‌ని, ఇప్పుడు.. హోదా బాధ్యత లేదని ఆ పార్టీ నేత‌లు వాదిస్తూ వ‌స్తున్నారు. గతం కంటే గట్టిగా ఇప్పుడు… హోదా అనేది ఓ ముగిసిన అధ్యాయమని ప్రకటిస్తున్నారు. హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజి ఇస్తామ‌ని గ‌త స‌ర్కారు ఇచ్చిన ఆదేశాల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని క‌మ‌ల‌నాధులు చెపుతున్నా, అవ‌కాశ‌మెచ్చిన‌ప్పుడ‌ల్లా హోదాను అడుగుతునే ఉంటామ‌ని అంటున్నారు వైసిపి నేత‌లు. 


గత ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. వాటిని ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు సీఎం హోదాలో.. మళ్లీ అవే తీర్మానాలు చేసి .. కేంద్రానికి పంపుతుండ‌టం గ‌మ‌నార్హం.  గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో…క‌ష్టాల‌లో, లోటు బ‌డ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు వ‌స్తాయ‌న్న ఉద్దేశంలో అప్ప‌టి సిఎం చంద్ర‌బాబు  ఆయన ఉద్దేశం కావొచ్చు. ప్యాకేజీ తీసుకుంటామని.. హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. త‌రువాత పూర్తి స్ధాయి హోదా ఇవ్వాల‌న్న డిమాండ్‌తో ఎన్‌డిఏ నుంచి బైట‌కు వ‌చ్చారు.


 


 కానీ ప్ర‌స్తుతం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని  ఏపీ సర్కార్.. హోదాయే త‌మ‌కు కావాల‌ని  ప్యాకేజీ   వద్దని తేల్చి చెప్పింది. దాంతో.. ఇప్పటి వరకూ… ప్యాకేజి కోసం ప్ర‌త్యేక వాహ‌కం ఏర్పాటు చేసి అమలు చేయాలా వద్దా.. అన్న డైలమాలో ఉన్న కేంద్రం.. హోదా ఎలానూ ఎగ్గొట్టాం క‌నుక‌ ప్యాకేజీకి కూడా చిల్లులు పెట్ట‌డం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఏపీకి అటు హోదా రాదు.. ఇటు ప్యాకేజీ ఇవ్వరు. అటు గొడ దెబ్బ‌, ఇటు చెంప‌దెబ్బ‌ల‌తో ఏపీ మొత్తానికి దగా పడేలా క‌నిపిస్తోంది.  భారతీయ జనతా పార్టీ కి పూర్తి స్ధాయి మెజార్టీ ఉన్నందున హోదా వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు లేద‌ని సిఎంగా ప్ర‌ధానిని క‌ల‌సిన రోజు సిఎంజ‌గ‌న్ త‌న గొంతుక త‌గ్గించి మాట్లాడారు. కానీ.. తాము అను నిత్యం  అడుగుతామంటూ హడావుడి చేస్తు,. అసెంబ్లీల్లో తీర్మానాలు చేస్తున్నారు.  మ‌న‌సు క‌ర‌గ‌క పోతుందా? అన్న ఆలోచ‌న మంచిదే.. కానీ అక్క‌డ ఉన్న‌ది క‌ర‌డు గ‌ట్టిన మోడీ అని గుర్తు పెట్టుకోవ‌టం మంచిది, హోదా విష‌యంలో పిల్లి మొగ్గ‌లేసిన టిడిపిని మూల కూర్చోపెట్టార‌ని ఏద్దేవా చేసే వైపిపి పార్ల‌మెంటు స‌మావేశాల ఆరంభం నుంచి హోదా కోసం ఏర‌క‌మైన వ్యూహాలు చేస్తుందో?  చూడాలి.

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM