కేసీఆర్‌తో జ‌గ‌న్ లాలూచీ లెక్కేంటి?

by సూర్య | Fri, Jun 21, 2019, 02:14 PM

జగన్‌.. కేసీఆర్‌ ట్రాప్‌లో పడ్డారని.. . తెలంగాణ సర్కారుతో   లాలూచీ పడ్డారన్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని, దీనిపై ప్రజలకు  వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్  చేశారు టిడిపి నేత వేద‌వ్యాస్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిరసనగా గతంలో కర్నూలులో మూడు రోజులు పాటు జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ ప్రాజెక్టు కడితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇండియా-పాకిస్థాన్‌లా అ వుతాయని  జ‌గ‌న్  సీఎం కాగానే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారనిప్ర‌శ్నించారు.


శుక్రవారం  తెదేపా నేత బూరగడ్డ వేదవ్యాస్  మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇబ్బందుల‌లో ప‌డుతోంద‌ని, దీనిపై పోరాటం చేస్తాంటూ బీరాలు ప‌లికారంటూ జగన్‌ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై   చేసిన వ్యాఖ్యల వీడియోల‌ను మీడియా ఎదుట ప్రదర్శించారు. 


వీటిలో నేను అడుగుతున్నా కేసీఆర్‌ను ఎవడబ్బ సొత్తప్పా ఇది అని అడుగుతున్నా..? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతున్నారు. వాటికి అనుగుణంగా లెక్కలు కడుతున్న చంద్రశేఖర్ రావు తీరు ధర్మమేనా..? ఇరు రాష్ట్రాల నీటి వాటా ఎంత అనేది కృష్ణా, గోదావరి నదుల్లో తేలలేదు. కేవలం మీది ఎగువ రాష్ట్రం కాబట్టి.. మీ అవసరాలు తీరాకే మాకు నీళ్లు పంపిస్తామని హిట్లర్‌లా మాట్లాడటం చంద్రశేఖర్ రావు కు భావ్యం కాదు. చంద్రశేఖర్ రావు కు జ్ఞానోదయం కావాలి, చంద్రబాబు జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాఅని జగన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM