మా పార్టీలో చేరినా, సుజ‌నా కేసులు య‌ధాత‌థం

by సూర్య | Fri, Jun 21, 2019, 01:55 PM

 బీజేపీలో చేరి త‌న మీద ఉన్న కేసుల‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, సిఎం ర‌మేష్‌లు ఎత్తి వేయించుకున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు ఆ పార్టీ నేత మురళీధరరావు  టీడీపీ ఎంపీలో బీజేపీలో చేరికపై  వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆయన శుక్రవారం మీడియా కు స‌మాధానం ఇచ్చారు. ఏపిలో భార‌తీయ జ‌న‌తా  పార్టీని క్షేత్ర స్ధాయి నుంచి బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలోనే  టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నామని, ఇది త‌ప్పెలా అవుతుంద‌ని నిల‌దీసారు.  రాజ్య‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ ఎంపీలు త‌మ పార్టీని బిజెపిలో విలీనం చేయాల‌ని రాజ్యాంగంలోని నిబంధ‌న‌ల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఇది అనైతికం  అని ప్ర‌చారం చేయ‌టం స‌రికాద‌న్నారు.  టిడిపి నుంచి బిజెపిలోకి వ‌చ్చినంత‌ మాత్రాన ఆయా ఎంపీల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఐటీ, ఈడీ కేసుల నుంచి తప్పించుకోలేరని, కేసులు, రాజ‌కీయాల‌నే వేర్వేరుగా చూడాల‌ని అన్నారు ముర‌ళీధ‌ర్‌.


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM