మోదీతో సుజనా, టీజీ, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ భేటీ!

by సూర్య | Fri, Jun 21, 2019, 12:38 PM

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరు టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరారు. తాజాగా ఈ నలుగురు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మోదీ నివాసానికి వెళ్లిన నేతలు, ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, బీజేపీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఈ నలుగురు నేతలకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరి చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 75కు చేరుకుంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM