టిడిపి ఎద‌గాల‌నుకుంటే... బిజెపిలోకి ఎందుక‌ట‌

by సూర్య | Fri, Jun 21, 2019, 11:15 AM

  ఏకంగా కేంద్రమంత్రి పదవి వెల‌గ బెట్టిన సుజన చౌదరి కేసుల‌కు, రాజ‌కీయాల‌కు సంబంధంలేదంటూనే   మేము రాష్ట్రము కోసమే పార్టీ మారుతున్నామని చెప్పుకొచ్చాడు.  అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా “తెలుగుదేశం పార్టీ ఎదగాలని కోరుకుంటున్న” వాళ్ల‌లో త‌ను కూడా ఉన్న‌ట్టు చెప్పారు.   ఇదేదో తిరకాసులా ఉంద‌న్న వాద‌న‌లు అప్పుడే బిజెపిలో వినిపిస్తోంది. టీడీపీ ఎదిగే పార్టీ అయితే అసలు వదిలివెళ్ళవలసిన పని ఏమిటి.. ఒక వేళ టీడీపీ ఎదిగితే బీజేపీలో సుజన ఏమి చేస్తాడు అన్న ప్ర‌శ్న‌లూ ఎదుర‌వుతున్నాయి. 


తెలుగుదేశం పార్టీ నుండి సుజనా చౌదరి,సీఎం రమేష్,టీజీ వెంకటేష్,గరికపాటి నిన్నటికి నిన్న  బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌టం ఆ పార్టీ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్రబాబుకి నమ్మిన బంట్లుగా వ్యవహరించే సుజనా చౌదరి,సీఎం రమేష్ లు పార్టీ మారటం   సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  విప‌క్షంగా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడుఈ ఇద్దరు కూడా పార్టీకి అండగా నిలిచారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళని రాజ్యసభ సీటు ద‌క్కింద‌న్న‌ది వాస్త‌వం. అయితే త‌మ మీద వ‌త్తివ‌ల్లే పార్టీని వీడాల్సి వ‌స్తుంద‌ని వెళ్లిపోయిన ఎంపిలు చెపుతున్నారు. 


 


నిజానికి  ఆంధ్రాలో బీజేపీని బలోపేతం చేయాలనే, చంద్రబాబుకి ప్రధాన అనుచరుడు అనే ముద్ర బలంగా ఉన్న సృజ‌నాకు వ‌లేసిన క‌మ‌ల‌నాధులు  పార్టీలో చేర్చుకుంద. అలాంటి పరిస్థితులో సుజనా టీడీపీ ఎదిగితే చూడాలని ఉందని చెప్పటంతో ఇప్పుడు బీజేపీలో ఆలోచన మొదలైంది. దీంతో పార్టీలోకి టిడిపి నుంచి ప‌లువురిని ర‌ప్పించే ప‌నిని కూడా ఈ న‌లుగురేకేఅప్ప‌గించిన‌ట్టుస‌మాచారం. 


 


 


 

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM