2021 నాటికి పోల‌వ‌రం పూర్తి చేయాలి : సిఎం జ‌గ‌న్‌

by సూర్య | Fri, Jun 21, 2019, 01:10 AM

పోలవరం ప్రాజెక్టును నాణ్యత ప్రమాణాలతో 2021 జూన్‌ నాటికల్లా పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలంలోని సమావేశమం దిరంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా ఉన్నతాధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పరిస్థితి భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఎంతకాలంలో ఈ ప్రాజెక్టు ప్రధాన జలాశయం పూర్తి చేస్తారో ఒక కాలాన్ని నిర్ధేశించాలని హడావిడిగా పనులు చేసి నాణ్యత లేకుండా చేయవద్దని ఆయన అధికారులకు సూచించారు. 2021 జూన్‌ నాటికల్లా ప్రాజెక్టు పనులన్ని పూర్తి చేస్తామని ఈ విషయంలో ఎటువంటి వత్తిడిలేని పనివిధానాన్ని అమలు చేస్తామని ఇంజనీర్లు చెప్పడంతో, ముఖ్యమంత్రి స్పందిస్తూ హడావిడిగా హార్భాటం కోసం ఈ ప్రాజెక్టు పనులు చెయడం మంచిది కాదని ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలకు రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాల్సి ఉన్నందున నాణ్యతలో రాజీ లేదని జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులన్ని పూర్తి అయితే మరో 10 నెలలో హైడ్రాలిక్‌ ఫవర్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM