ఆనంద జీవ‌నం యోగాతో సొంతం

by సూర్య | Thu, Jun 20, 2019, 11:05 PM

ఆరోగ్యం, ఆనందాలకు చక్కని సాధనం యోగ అని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ముంబాయ్‌ ఛీప్‌ జనరల్‌ మేనేజర్‌ (పిఆర్‌) రాజీవ్‌ గోయల్‌ పేర్కోన్నారు. ప్రపంచ యోగ డే సంధర్భంగా వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం సహకారంతో ప్రజాపీత బ్రహ్మకుమారీస్‌ విశ్వవిద్యాలయం గురువారం వీజేఎఫ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా గోయల్‌ మాట్ల్డాడుతూ మనసు శరీరం ఆధీనంలో ప్రశాంతంగా వున్నపుడే సత్ఫలితాలు సాధన సులభతరమవుతుందన్నారు. ప్రజారోగ్యం కోసం దేశ వ్యాప్తంగా హెచ్‌పిసిఎల్‌ అనేక సామాజిక సేవా కార్యక్రమాలనుచేపడుతున్నదన్నారు. ప్రజాపీత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హెచ్‌ బి కాలనీ బ్రాంచీ నిర్వహకురాలు బికె రామేశ్వరీ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎంతో ప్రధానమైందన్నారు. ఆదర్శంతమైన సమాజం కోసం బ్రహ్మకుమారీస్‌ చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయం అని హెచ్‌. పి. సి. ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ యుఎస్‌ శర్మ పేర్కోన్నారు. మీడియా రంగంలో పని చేస్తున్న వారికి శారీరక మానసిక ఆఱోగ్యం కోసం యోగ సాధన అవసరమని చెప్పారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎయూ యోగా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె రమేష్‌ బాబు, వీజేఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఇరోతి ఈశ్వరావు, బ్రహ్మకుమారీస్‌ నిర్వహకులు బికె శివలీల, శశికళ, హెచ్‌పిసిఎల్‌ విశాఖ అధికారి కాళీ చరణ్‌ పాల్గోన్నారు. అనంతరం అతిధులను బ్రహ్మకుమారీలు సత్కరించారు.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM