డ్వాక్రా మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా : మ‌ంత్రి ముత్తంశెట్టి

by సూర్య | Thu, Jun 20, 2019, 11:00 PM

అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయ‌న  పి.యం పాలెం నాల్గవ వార్డులో డ్వాక్రా మహిళలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ది ఫలాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో పార్టీలకతీతంగా ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఐదు లక్షల ఇళ్లస్థలాలను, ఇంటి పట్టాలను పంపిణీ చేయనున్నామన్నారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పిల్లల తల్లులకు సంవత్సరానికి రూ 15 వేలను అందించనున్నామన్నారు. డ్వాక్రా ఋణమాఫీలను దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసక్తి గల ఎస్.హెచ్‌జిలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశపడకుండా స్వయం శక్తితో ఉపాది పొందేవిధంగా ఋణ సౌకర్యం కల్పిస్తామన్నారు. గతంలో తాను భీమిలి శాసన సభ్యునిగా ఉన్నపుడు సుమారు 650 కోట్ల రూ లతో అభివృద్ది పనులను, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్నపుడు రూ. 2500 కోట్లతో 6లైన్ల రహదార్ల పనులనిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళలు, ప్రజలు వారికి సంబందించి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని సంబందిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. జివియం సి కమిషనర్ హరినాయణన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సరియైన వర్షాలు లేక పోవుట వలన నదులు, రిజర్వాయర్లలో నీరు అడుగంటిందని అందుచేత మంచినీటి సమస్య ఏర్పడిందన్నారు. నాలుగు, ఐదు ,ఆరు వార్డులకు సంబందించి ప్రతిసంవత్సరం గోస్తనీ నదినుండి పంపింగ్ చేసి ఎండాడ ద్వారా సరఫరా చేయడం జరిగేదన్నారు. భవనాలు, అపార్ట్‌మెంట్లలో బోర్లు వేయడం వలన భూ గర్భజలాలు ఇంకిపోవడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలను నిర్మించుకోవడం ద్వారా భూగర్భజలాన్ని పెంచుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో యుసిడి పిడి సోమన్నారాయణ, జోనల్ కమిషనర్ దుర్గా ప్రసాద్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


 


 

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM