రాజ్యసభలో రెండుకు పడిపోయిన టీడీపీ సభ్యుల బలం

by సూర్య | Thu, Jun 20, 2019, 05:11 PM

తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో బలం రెండుకి పడిపోయింది. ఇంతకు ముందు ఆరుగురు సభ్యులుండగా నలుగురు సభ్యులు పార్టీని వీడారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ నలుగురు తాము టీడీపీతో విభేదించి బయటకి వచ్చేశామని, తమను ఏ పార్టీకి చెందిన నేతలుగా చూడొద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కోరారు. చైర్మన్ ఇచ్చిన విందుకు హాజరైన ఈ నలుగురు నేతలు లేఖను కూడా అక్కడే అందించారు. ముందుగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయి అనంతరం పార్టీని వీడారు. దీంతో సభలో టీడీపీ బలం రెండుకు చేరింది. ఎంపీలు కనకమేడల, సీతారామలక్ష్మిలు మాత్రమే టీడీపీ సభ్యులుగా ఉంటారు.


 


 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM