రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం

by సూర్య | Thu, Jun 20, 2019, 03:16 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు నిర్వహించనున్నారు. ప్రతియేడాది జూన్‌ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపకరించే ప్రాచీన భారత ప్రక్రియ అయిన యోగాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి అసెంబ్లిలో 177 దేశాలు ఆమోదం తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ” వాతావరణ కార్యాచరణ” అనే అంశాన్ని థీమ్‌గా నిర్ణయించారు. భారత దేశంలో అతి ప్రాచీన కాలంనాటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన యోగా అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. యోగా అనే పదం సంస్కృతంనుంచి వచ్చిందని, దీనికి కలయిక అని అర్థమని, శరీరం, చైతన్యం ఐక్యమవడానికి ప్రతీకగా ఈ పదం ప్రయోగిస్తున్నారని ఐక్య రాజ్య సమితి పేర్కొంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM