ఇక మెజార్టీ పైనే దృష్టి : పివిపి

by సూర్య | Fri, Mar 22, 2019, 11:57 PM

వైఎస్ యస్ జగన్ అభిమానుల, వైసీపీ కార్యకర్తల జనసందోహమే త‌న గెలుపున‌కు బాటని విజయవాడ పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ సబ్‌కలెక్టర్ కార్యాల‌యంలో ఆయ‌న సతీసమేతంగా శుక్ర‌వారం నామినేషన్ వేశారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  ప్రపంచంలోనే ఎవరు  చేయలేని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదేన‌ని, రానున్నది వైయస్సార్ రాజ్యమని చెప్పారు. జగన్ నవరత్నాలను ప్రతి ఇంటికి అందేవిధంగా కృషి చేస్తామని పెద్ద పెద్ద పనులు చేస్తాం అని చెప్పననీ చిన్నపనులును పెద్దగా చేస్తానని తెలిపారు. విమర్శలు పట్టించుకోనని అభివృద్ధిపైన దృష్టి పెడతానన్నారు. నవరత్నాలను కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా పేద ప్రజల అభ్యున్నతికి అందజేస్తామని తెలిపారు.  తొలుత పటమట ఎంఎస్ఎన్ స్కూల్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. అనంతరం అభిమానులు పార్టీ కార్యకర్తలు నడుమ కోలాహలంగా న‌డుమ నామినేషన్ వేశారు. ర్యాలీ పటమట, 18వ డివిజన్, ఏవన్ కన్వెన్షన్, బెంజ్ కంపెనీ, మురళి ఫ్యార్చ్యన్ , గిరిపురంల మీదుగా సాగింది. రోడ్లకు ఇరువైపులా ప్రజలు పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు. 13 రకాల వివిధ సాంస్కృతిక బృందాలచే ప్రదర్శనలు సాగాయి. డప్పు కళాకారులు, తప్పెటగుళ్ళు మొదలైన వాటితో ప్రదర్శన సాగింది.12 గంటలకు సతీసమేతంగా నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాల‌యంలో అందించారు. కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM