ఫెడరల్‌ఫ్రంట్‌ను మోదీఫ్రంట్‌గా మార్చారు..

by సూర్య | Fri, Mar 22, 2019, 11:32 PM

గ‌డ‌చిన ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేశామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో శుక్ర‌వారం నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ అన్ని గ్రామాలనూ స్మార్ట్‌ గ్రామాలుగా మారుస్తున్నామన్నారు.  హుద్‌హుద్‌ తుపాను తర్వాత ఎంతో కష్టపడ్డాని..  విశాఖ నగరం కోలుకునే వరకు ఇక్కడే ఉండి పనిచేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు చేసి దానిని మోదీఫ్రంట్‌గా మార్చారని, దీనిలో విప‌క్ష నేత జ‌గ‌న్‌, ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకునే కేసీఆర్‌లు భాగ‌స్వాముల‌ని, ల‌క్ష‌కోట్ల‌కు పైగా తెలంగాణ ఆస్తుల నుంచి ఇవ్వాల్సి ఉన్నా వీరు నోరుమొద‌ప‌ర‌ని ఎద్దేవా చేసారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM