ఏపీ లో కొంత మంది అధికారులు ప్ర‌భుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు

by సూర్య | Fri, Mar 22, 2019, 06:15 PM

ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు తమ పార్టీ సింబల్‌ను పోలి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈసీ సునీల్‌ అరోరాను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ లో కొంత మంది అధికారులు ప్ర‌భుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశాం. డీజీపీ ఠాకూర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాం. చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులను తొలగించాలని కోరాం. నిబంధనలకు విరుద్ధంగా 37 మందిని ప్రమోట్‌ చేసిన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. పోలీసులతో డబ్బులు తరలిస్తున్న సాక్ష్యాధారాలను సీఈసీకి ఇచ్చాం. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్‌ ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్న సాక్ష్యాలను సీఈసీకి ఇచ్చాం. ప్రజాశాంతి పార్టీ గుర్తు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తును పోలి ఉందని...మరోసారి పునఃపరిశీలించాలని సీఈసీని కోరినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


 


 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM