విష్ణునివాసం, చౌల్ట్రీల్లో జెఈవో త‌నిఖీలు

by సూర్య | Fri, Mar 22, 2019, 01:12 PM

తిరుప‌తిలోని విష్ణునివాసం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, శ్రీ గోవింద‌రాజ‌ 2, 3వ స‌త్రాల్లో శుక్ర‌వారం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం త‌నిఖీలు నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ విష్ణునివాసం, స‌త్రాల్లో యాత్రికుల‌కు సులువుగా గ‌దులు ల‌భ్య‌మ‌య్యేలా, గ‌దుల్లో అన్ని సౌక‌ర్యాలు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. మెరుగైన ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని, విద్యుత్‌, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. సిసి టివిలతోపాటు, డిఎఫ్ఎండి ఏర్పాటుచేసి భ‌ద్ర‌త‌చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ప‌చ్చ‌ద‌నం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దుతామ‌ని వివ‌రించారు. ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌లో క్లోరినేష‌న్ చేస్తామ‌న్నారు. సత్రాల్లో బెడ్‌షీట్లు, దిండుక‌వ‌ర్లు త‌క్ష‌ణం మారుస్తామ‌ని, ఇక్క‌డ మెరుగైన పారిశుద్ధ్యం కోసం సంబంధిత అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టేలా ఆదేశించామ‌ని తెలిపారు. స‌త్రాల్లో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దుతామ‌న్నారు.


అంత‌కుముందు విష్ణునివాసం, స‌త్రాల్లోని గ‌దులను, తాగునీటి వ‌స‌తిని, డాగ్ స్క్వాడ్‌, లాక‌ర్ల స‌దుపాయం, ప్రథ‌మ చికిత్స కేంద్రాలు, గ‌దుల కేటాయింపు కేంద్రాలు, స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలను జెఈవో ప‌రిశీలించారు.  జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, ఏఈవో శ్రీమ‌తి పి.గీత‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డా..సునీల్‌కుమార్‌, ఏవిఎస్‌వో శ్రీ రాజేష్ త‌దిత‌రులు ఉన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM